సీఎం వైయస్ జగన్ పాలన ‘వంద’శాతం బాగుంది
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలన 100 శాతం బాగుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అడుగులు వేశారన్నారు. ఆసరా పింఛన్ పెంపు, గ్రామ సచివాలయం ద్వారా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు, రైతులకు పెట్టుబడి సాయం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ కార్మికులకు జీతాల పెంపు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నూతన ఇసుక పాలసీతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. ఉగాది నాటికి 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 100 రోజుల్లో 80 శాతం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.