ప్రత్తిపాటి పుల్లారావుకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సవాల్
20 Sep, 2022 11:56 IST

అసెంబ్లీ: టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బహిరంగ సవాల్ విసిరారు. లంచం అడగలేదని ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణం చేయగలడా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ‘గౌతమబుద్ధ టెక్స్టైల్స్ అనుమతికి రూ.20 కోట్ల లంచం అడిగారు. చంద్రబాబు నుంచి లోకేష్ వరకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ మారడంతో పాటు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు. లంచం అడగలేదని ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణం చేయగలడా..?’ అని ప్రశ్నించారు.