ప్రత్యేక హోదా ద్రోహులకు ఓట్లెందుకు వేయాలి..?
6 Apr, 2021 12:31 IST
తిరుపతి: విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి బహిరంగలో వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా నరేంద్రమోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా..? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ రాజకీయ పరిజ్ఞానలేమికి నిదర్శనమని చురకంటించారు. పెట్రోల్ ధరలను కేంద్రం పెంచినప్పుడు చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.