ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన బాధాకరం
22 Jun, 2021 16:27 IST
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన బాధాకరమని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా అన్నారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి డీజీపీతో మాట్లాడారన్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లను నియమించారన్నారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి రూ.5 లక్షల పరిహారం అందజేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై విమర్శలు చేసే అర్హత టీడీపీకి లేదన్నారు. వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. దళిత మహిళను అచ్చెన్నాయుడు కొట్టినప్పుడు టీడీపీ నేతలంతా ఏమయ్యారని నిలదీశారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చేతగాని దద్దమ్మ నారా లోకేష్ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు.