175 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పే ధైర్యముందా మాలోకం..?
నెల్లూరు: 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పే ధైర్యం మాలోకం లోకేష్‌కు ఉందా..? దమ్మూ, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే.. నిజంగా నీ ఒంట్లో మీ నాయన రాయలసీమ రక్తం ఉంటే 2024లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పు లోకేషా.. అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో అనిల్‌కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సింగిల్‌గానే పోటీ చేస్తుందని, సీఎం వైయస్ జగన్ దమ్మున్న నాయకుడని, ప్రజల మనసు గెలిచిన లీడర్ అని అన్నారు. వైయస్ఆర్ సీపీ 2014లో సింగిల్‌గానే, 2019లో సింగిల్‌గానే పోటీ చేసిందన్నారు. 2024లో సింగిల్‌గానే, 2029లో కూడా సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు. సింగిల్‌గానే పోటీచేసి గెలిచే దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంచేశారు.