మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం
16 Jan, 2021 13:29 IST
తాడేపల్లి: మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం సహించబోమని, ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో విషప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఏపీ మత సామరస్యానికి ప్రతీక.. మతాల మధ్య ఘర్షణ లేనే లేదు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. బూట్లు వేసుకుని పూజలు చేసే నీకు హిందూత్వంపై ప్రేమ ఉందా?. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.