అమరావతి ఉద్యమం ఒక ఫేక్
గుంటూరు: అమరావతిలో చంద్రబాబు చేయిస్తున్న ఉద్యమం ఒక ఫేక్ అని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఎమ్మెల్యే అంబటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్ జగన్ సర్కార్ పనిచేస్తుందన్నారు. 18 నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. సంక్షేమ పథకాలు అమలు చూసి ఓర్వలేని చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రభుత్వంపై విషప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిని చేశారని, మంగళగిరిలో తన కొడుకును ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలిపించుకోలేక పోయాడని అంబటి ఎద్దేవా చేశారు.