దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం
18 May, 2019 11:58 IST
ప్రకాశం: దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితుల పట్ల టీడీపీ నేతల వైఖరి దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో దళితులు ఓట్లు వేసేలా రక్షణ కల్పించాలని ఆయన డిమాండు చేశారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ ధర్మారెడ్డిపై కావాలనే బురద చల్లుతున్నారని, అరాచకశక్తులకు చంద్రబాబు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు.