ముస్లిం సమాజమంతా వైయస్ఆర్‌సీపీ వెంటే
తాడేపల్లి: ముస్లిం సమాజమంతా వైయస్ఆర్‌సీపీ వెంటే నడవాలని కోరుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ బాషా, మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ భాషా అధ్యక్షతన మైనారిటీ విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ ఆలూరు సాంబ శివా రెడ్డి, మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోనల్ అధ్యక్షులు, విభాగ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
మైనారిటీల సంక్షేమానికి వైయస్ జగన్ పెద్దపీట: వి. ఖాదర్ బాషా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మైనారిటీల సమస్యలపై పోరాడుతుంది. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో వైయస్ జగన్ గారు మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానం అమలు చేయలేదు, కానీ వైయస్ జగన్ ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలుచేశారు. అంతేకాదు మైనారిటీల అభివృద్ది కోసం రూ. 23,000 కోట్లు ఖర్చుచేశారు. చంద్రబాబు మనసులో మైనారిటీలు అంటే ద్వితీయ శ్రేణి పౌరులు. నేను వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పిన చంద్రబాబు బిల్లుకు మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ముస్లింలకు తీరని అన్యాయం చేశాయి. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ముస్లింల వెంట నడిచింది. ముస్లిం సమాజం అంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరుతున్నా.
వక్ఫ్ పై బలంగా పోరాడుతుంది వైయస్ఆర్‌సీపీనే: మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్,
`వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మైనారిటీలు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ప్రతి ఒక్కరినీ ఆదుకున్నారు. ఎంతో మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంలో సీనియర్ అడ్వకేట్లను నియమించి మన పోరాటానికి మద్దతిచ్చారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో ధైర్యంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఘనత కూడా వైయస్ జగన్ గారిదే. అలాగే వక్ఫ్ చట్టంపై మన తరుపున లోక్‌సభలో, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేశారు. సుప్రింలో కూడా కేసు వేశారు. వక్ఫ్ పై బలంగా పోరాడుతుంది వైయస్ఆర్‌సీపీనే. మనవైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడమే మన లక్ష్యం. మీ అందరి సూచనలు, సలహాలతో రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ మైనారిటీ వింగ్‌ను తిరుగులేని శక్తిగా రూపొందిద్దాం` అని అబ్దుల్ హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు.