మండలి నుంచి వైయస్ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్
అమరావతి: విశాఖపట్నంలో టీడీపీ ఎంపీకి చెందిన గీతం వర్సిటీకి భూముల కేటాయింపులకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. మండలిలో గీతం వర్సిటీకి సంబంధించి వైయస్ఆర్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కాపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు. సమాధానం చెప్పలేక 151 సీట్లు ఉన్న మీకు 11 వచ్చాయి అంటూ ఓవరాక్షన్‌కు దిగారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.
సరైన సమాధానం ఇవ్వాల్సిందే: బొత్స సత్యనారాయణ
`భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందే. వైజాగ్‌లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గీతంకి భూములు కేటాయింపులకు నిరసనగా వాక్ అవుట్ చేస్తున్నాం’ అని బయటకు వచ్చారు.