ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ వివాదాలు తగ్గుతాయి
10 May, 2024 19:19 IST
తాడేపల్లి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి, అమ్మకాలు, కొనుగోలు సులభం అవుతుందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ప్రజలకు ఏం చేస్తారో మ్యానిఫెస్టో ద్వారా చెప్పి ప్రజల ముందుకు వెళ్ళాలని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఏమన్నారంటే..
- టీడీపీ మ్యానిఫెస్టో ఏంటో ప్రజలకి చెప్పకుండా విమర్శలతో,వైయస్సార్ సిపిపై దుష్ప్రచారంతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
- మీకు,మీ కుటుంబానికి లబ్ది చేకూరింది అని భావిస్తేనే మాకు ఓటు వేయండి అని జగన్ గారు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
- తిరిగి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే మేనిఫెస్టోతో రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి-సంక్షేమం చేస్తానని చెప్పి జగన్ గారు ప్రజల ముందుకు వెళ్తున్నారు
- ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైయస్సార్ సిపి ప్రభుత్వం తెస్తున్నది కాదు.భారత దేశంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి 60%కేసులు సివిల్ కేసులే ఉన్నాయి.ఈ నేపధ్యంలో వాటికి పరిష్కారం కనుగొనాలనే మంచి లక్ష్యంతో ఈ యాక్ట్ ను రూపొందించారు
- 2008 నుండి ఈ యాక్ట్ మీద అధ్యయనం జరుగుతోంది. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక యాక్ట్ కు సంబంధించి నీతి అయోగ్ అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పలు సూచనలు,సలహాలు చేసింది.
- ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను టీడీపీ అసెంబ్లీ లో మధ్దతు తెలిపింది.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో పయ్యావుల కేశవ్ మద్దతుగా మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగింది. ముందు సమగ్ర భూ సర్వే చేయడం ఈ యాక్ట్ లో ముఖ్యమైన అంశం.
- ఇప్పుడు వరకు బ్రిటీష్ కాలంనాటి పాత పద్ధతిలో గొలుసులతో సర్వే జరుగుతుంది. వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక 10 వేల మంది సర్వే సిబ్బందిని పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో 6 వేల గ్రామాలలో సర్వే పూర్తి చేసాం
- కొంతమంది హైకోర్ట్ లో పిటిషన్ వేస్తే మేము క్లారిటీగా చెప్పాం. ఈ యాక్ట్ ఇంకా అమలులో లేదని.రాష్ర్టంలో 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సర్వే పూర్తి అయింది.అంతా పూర్తి అయిన తర్వాతనే అమలులోకి వస్తుంది స్పష్టంగా చెప్పాం.
- సర్వే,ప్రజలనుంచి అభ్యంతరాల స్వీకరణ,మార్పులు చేసి అమలు చేయడానికి సమయం పడుతుంది.
- కొంతమంది రిటైర్డ్ అధికారులతో అసత్యాలతో కూడిన తప్పుడు ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తుంది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజలను భయభ్రాంతులను చేసేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారు.
- వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే భూములు కబ్జాచేస్తారని, లాక్కుంటారని దినపత్రికలలో సైతం పెద్ద పెద్ద యాడ్స్ వేసి ప్రజలను భయపెడుతున్నారు.ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నారు
- ప్రజలకు ఒరిజనల్ పత్రాలు ఇవ్వరని కేవలం జిరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తారని, భూములు అమ్ముకుంటారని అబద్దాలు చెబుతున్నారు.
- వైయస్ జగన్ గారు భూములు లాక్కుంటున్నారని విషప్రచారం చేస్తున్న చంద్రబాబు అలా ఎన్ని భూములు లాక్కున్నారో ప్రజలకు చెప్పాలి.
- ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి,అమ్మకాలు,కొనుగోలు సులభం అవుతుంది.
- రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 124 చట్టాలు ఉన్నాయి వాటన్నిటికంటే ఈ ఒక్క యాక్ట్ వల్ల భూహక్కు దారులకు మేలైన ప్రయోజనాలు కలుగుతాయి.