కుట్టు మిషన్ల పేరుతో `కూటమి` దోపిడీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్ల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. కుట్టుమిషన్ల స్కాంపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి , మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు , పిల్లి సూర్యప్రకాష్ , పినిపే శ్రీకాంత్,గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి , పితాని బాలకృష్ణ, జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.