అక్రమ కేసులకు నిరసనగా..
13 Jan, 2019 14:28 IST
అనంతపురం: ప్రజల తరపున పోరాడే హక్కును కూడా పోలీసులు కాలరాస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్మభూమి కార్యక‍్రమంలో ప‍్రజా సమస్యలపై నిలదీశారన్న అక్కసుతో విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులను బ నాయించడంపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన నిర్వహించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనంతపురం ఎస్సీ కార్యాలయాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ముట్టడించారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags