చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగ, దోపిడి, కుట్రలే
21 Oct, 2021 14:51 IST
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగ,దోపిడి, కుట్రలేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అమిత్‌షాపై రాళ్లదాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక బిఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ సర్కిల్స్ లో జనాగ్రహ దీక్షల పేరుతో వైయస్ఆర్‌సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు.