అనంత వెంకటరెడ్డి ఆశయాలు భావి తరాలకు మార్గదర్శకం
5 Jan, 2026 11:34 IST
అనంతపురం: అనంత వెంకటరెడ్డి ఆశయాలు భావి తరాలకు మార్గదర్శకమని వైయస్ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొనియాడారు. అనంతపురం పట్టణంలో అనంత వెంకటరెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైయస్ఆర్‌సీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అనంత వెంకటరెడ్డి ప్రజాసేవలో చూపిన అంకితభావం, నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.