ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
11 Sep, 2019 11:42 IST
అమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ వైయస్‌ఆర్ సీపీ నేతలు మోపిదేవి వెంకట రమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌లతో బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. మోపిదేవి వెంకటరమణ, రామకృష్ణారెడ్డిలు భగవద్గీత మీద, మహ్మద్ ఇక్బాల్ ఖురన్ మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు.