వైయస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
11 Jun, 2024 18:13 IST
తాడేపల్లి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్‌తో పలువురు పార్టీ నేతలు భేటీ అయి ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల నాని, జక్కంపూడి రాజా, రాపాక వరప్రసాద్, ముస్తఫా, బాలరాజు, తదితరులు ఉన్నారు.