జోగి రమేష్‌తో వైయస్ఆర్‌సీపీ నేతల ములాఖత్
20 Nov, 2025 16:17 IST
నెల్లూరు: అక్రమ కేసులో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌తో వైయస్ఆర్‌సీపీ నేతలు గురువారం ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జోగి రమేష్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.