ఉప్పాల హారికకు వైయస్ఆర్‌సీపీ నేతల పరామర్శ
కృష్ణా జిల్లా: టీడీపీ, జనసేన గూండాల దాడికి గురైన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను వైయస్ఆర్‌సీసీ నాయకులు పరామర్శించారు. గురువారం పెడన మండలం కూడూరు గ్రామంలో ఉప్పాల హారికను వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాష్ట్ర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు బుల్లా మేరీ కుమారి, రాష్ట్ర బుందిలి సంఘం అధ్యక్షులు బొందిలి నరేంద్ర సింగ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుల సీరం సెట్టి పూర్ణచంద్రరావు, బోదాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ ముదిగొండ ప్రకాష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, కృష్ణా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తోట రాజేష్, గుడ్లవల్లేరు మండల యూత్ అధ్యక్షులు గుదే రవి, జిల్లా జాయింట్ సెక్రెటరీ కందుల నాగరాజు, గుడివాడ మైనార్టీ యూత్ నాయకులు అబ్దుల్ రజాక్ తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు.