కల్పన కుటుంబ సభ్యులకు వైయస్ఆర్‌సీపీ నేతల పరామర్శ
గుంటూరు: తాడికొండ మండలం కంతేరుకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన ను తెల్లవారుజామున మూడున్నర గంటలకు తాడికొండ పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేశారు. ఈ ఘటనను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రా బాబు, అన్నబత్తుని శివకుమార్ ,దొంతి రెడ్డి వేమారెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..` వైయస్ జగన్ ఆదేశాల తో కంతేరు లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన కుటుంబ సభ్యుల్ని పరామర్శించాం. వలపర్ల కల్పన పట్ల పోలీసుల అత్యంత దారుణంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3:30 కు తాడికొండ సిఐ వాసు అత్యంత దారుణంగా ఆమెను అరెస్ట్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లపై పోలీసుల ప్రవర్తిస్తున్న తీరుపై డీజీపీని కలుద్దామని అపాయింట్మెంట్ అడిగాము. మొన్న డిజిపిని నేను అపాయింట్మెంట్ అడిగాను. నిన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి డీజీపీని అపాయింట్మెంట్ అడిగారు. డీజీపీ ఎందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో డిజిపి ఉన్నారు. ఇది చాలా దురదృష్టం. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు మహిళల పట్ల రౌడీల వ్యవహరిస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి , పాలేటి కృష్ణవేణి, వలపర్ల కల్పన, మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. వలపర్ల కల్పన ను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసిన వాసు పై న్యాయపోరాటం చేస్తాం` అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.