ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైయస్ఆర్‌సీపీ నేతలు
20 Jul, 2025 19:27 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.
రాజంపేటలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మీడియా సమావేశం...
- రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించిన ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి...
- కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం హాస్యాస్పదంగా ఉంది...
- రాష్ట్ర ప్రభుత్వం ఇలానే చేస్తూ పోతే రాబోవు రోజుల్లో వాళ్లు కూడా ఇప్పటి నుంచే జైలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరించిన ఆకేపాటి...
- ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారు...
- చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు...
- ప్రభుత్వ వేదింపులు తాళలేక ఐపీఎస్ అధికారి సిద్దార్థ కౌశిల్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం...
- ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కు ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేశారని ప్రశ్నించిన ఆకేపాటి...
- మిథున్ రెడ్డికి ఒక ఎంపీ మాత్రమే ప్రభుత్వానికి అతనికి ఏమి సంబంధం, తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం...
మాజీ డిప్యూటీ సీఎం, వైయస్ఆర్‌సీపీ పిఏసి సభ్యులు ఎస్.బి.అంజాద్ బాష...
- రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుంది, రాక్షస పాలన కొనసాగుతుంది
- వైయస్ఆర్‌సీపీ నాయకులే టార్గెట్...
- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు
- పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైయస్ఆర్‌సీపీ ని ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు....లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు.
- ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు
- ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము.
- ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం - అంజాద్ భాష
- అధికారం శాశ్వతం కాదు–అధికారులు శాశ్వతం...వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే...
- మీరు ఒక దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించారు
- రాబోయే ప్రభుత్వాలు లో కూడా ఈ దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితి వస్తుందని అన్నారు.
- కూటమి ప్రభుత్వం లో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.
- రాబోయే కాలంలో అంతకు అంత వడ్డీతో సహా చెల్లిస్తాం...
- పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కామెంట్స్
- రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు
- ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం
- లిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదు
- లిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.
- వైయస్ఆర్‌సీపీ నాయకులు పై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు ..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుకా కామెంట్స్...
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.
- ఆధారాలు లేని కేసును నమోదు చేసి ఎంపీని అరెస్టు చేయడం చాలా దారుణం.
- ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు.
- కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
- మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ఎమ్మిగనూరు టిడిపి ఎమ్మెల్యే విమర్శలు చేయడం సరికాదు.
- ఏకవచనంతో సంభాషించడం మంచి పద్ధతి కాదు.
- వైయస్ జగన్ హయాంలో ఎమ్మిగనూరు నియోజవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం.
- తాగునీటి కోసం 143 కోట్లను వెచ్చించాం, ప్రతి ఇంటికి నీటిని తీసుకొచ్చాం.
- కరోనా సమయంలో కూడా వైయస్ జగన్ సుపరిపాలన అందించారు.
- దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక లోటుపాటితో కొట్టుమిట్టాడుతుంటే ఏపీలో మాత్రం ఇంటికే సంక్షేమ పథకాలు అందించాం.
విజయనంద రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇంచార్జి కామెంట్స్..
- ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
- కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ చేసింది
- మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కు వెన్నుదన్నుగా ఉండే ఎంపీ మిథున్ రెడ్డి ను అరెస్ట్ చేసి కక్ష్య సాధిస్తున్నారు
- ఇచ్చిన హమీలు అమలు చేయడం చేతకాదు, ప్రజలను మోసం చేసిన మీకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మదనపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి
- ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు చేస్తోంది
- మద్యం కేసులో ఎలాంటి సంబంధాలు లేకున్నా ఎంపీ అక్రమ అరెస్టు చేశారు
- రాష్ట్రంలో సుపరి పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులను టార్గెట్గా చేసుకుని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
- ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కాలం వెలదీస్తుందన్నారు.
- ఎంపీ మిథున్ రెడ్డిని విడుదల చేయాలని లేనిపక్షంలో వైసిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
- ఎంపీ మిథున్ రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయడం హాస్యాస్పధం గా ఉన్నది
- కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలే తప్ప వైయస్ఆర్ సీపీ నాయకులు టార్గెట్గా చేసుకుని అక్రమ అరెస్టులు అన్యాయం
వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కామెంట్స్
- ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది..
- ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాబు,కుట్రలకు తెరలేపుతున్నారు.
- మిథున్ రెడ్డి గారి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.
- రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు
- లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు,
- ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం..
-