ఇది ప్రజలను మోసం చేయడం కదా?
28 Jan, 2025 15:02 IST
విజయవాడ: సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని,ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని బాబు చేతులెత్తేశారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఇది ప్రజలను మోసం చేయడం కదా..ఇందుకు చంద్రబాబు ,పవన్ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. హమీల అమలు సాధ్యం కాదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేతలు స్పందించారు.
పోతిన మహేష్ ఏమన్నారంటే..
- సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాదని పవన్ చెప్పాడు..ఇప్పుడు పవన్ స్పందించాలి
- చంద్రబాబు పాలన సంక్షేమ పధకాల కోత..పన్నుల మోత గా ఉంది..
- రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు చేపడుతున్నాడు. హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకొంటున్నారు..
- విద్యుత్ చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, చాలనాలు వసూళ్లు చేయడం సంపద సృష్టించడం అంటారా?
- వైఎస్ జగన్ దగ్గర చంద్రబాబు , పవన్ ట్యూషన్ చెప్పించుకోవాలి..
- వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో సెంచరీ కొడితే... పవన, చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు..
- బీజేపీ చంద్రబాబు పవన్ పట్టుకున్న మ్యానిఫెస్టో పట్టుకోలేదు..
- ప్రజలు చంద్రబాబు, పవన్ మాయలో పడ్డారు..
- దావోస్ లో చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వ్యక్తలు పారిపోయారు..ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు..
- తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష 78వేల కోట్లు ఎంవోయూలు చేసుకొని పండగ చేసుకుంటున్నారు..
- 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వేత్తలు ఎందుకు రాలేదు..
- పవన్ దావోస్ పెట్టుబడులపై మాట్లాడాలి.. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా?
- కర్నూల్ గ్రీన్ కో అత్భుతంగా వుందని చెప్పిన కంపెనీ జగన్ హయాంలో వొచ్చింది..
- దావోస్ పర్యటన తరువాత చంద్రబాబు నాలిక మడతపడుతుంది..
- వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు చార్మినార్ కట్టారని చెపుతారు.
- 2014 నుండి 2019 వరకు టీడీపీ ఒక్క పని కూడా చేయలేదు.. ఒక్క శాశ్వత నిర్ణయం కూడా చెప్పట్టలేదు..
- అమరావతి కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది.. విజయవాడ వెస్ట్ బైపాస్ కట్టింది.. అమరావతి లో తిరుపతి తరహా గుడి కట్టింది వైఎస్ జగన్
- సింగపూర్ కంపెనీకి అమరావతి నిర్ణయం గురించి మాట్లాడారు
- అమరావతి లో రిజిస్ట్రేషన్ చార్జీలు లేవని చంద్రబాబు చెపుతున్నారు..పేద మధ్యతరగతి వాళ్ళు సెంటు భూమి కొనగలరా?
- పేదలు కొనే దగ్గర రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి.. పెట్టుబడి దారులు కొనే దగ్గర చార్జీలు తగ్గుతాయి.
- పేదల ఇంట్లో , మహిళల కళ్లల్లో వెలుగులు వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది..
- చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులు దారి మళ్ళితే పోలవరం పని పూర్తి అవుతుందా?
- ఏ పని చేయలేక.. ఏ పని చేతకాక గుద్ద కాల్చి వైఎస్ జగన్ పై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు..
- ఉద్దానం సమస్య కు శాశ్వత పరిష్కరం చూపిన నేత వైఎస్ జగన్
- ప్రాంతం చూడలేదు.. జగన్ సమస్య ను మాత్రమే చూసారు..
చంద్రబాబు ప్రకటనలో మోసం, వంచన: మల్లాది విష్ణు
- చంద్రబాబు ప్రకటనలో మోసం ,దగా , వంచన స్పష్టంగా కనిపిస్తున్నాయి
- రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో మోసం చేశావ్
- 2024 ఎన్నికల్లో ఏపీ శ్రీలంక అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు
- సూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గొంతు చించుకున్నారు
- జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిస్తామని చెప్పారు
- కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోలేదు
- గద్దెనెక్కిన దగ్గర్నుంచి వైఎస్ జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు
- జీడీపీ 15 శాతం కంటే ఎక్కువ ఉంటేనే సంక్షేమం ఇస్తామంటున్నారు
- పథకాలివ్వాలంటే ఎనిమిది తొమ్మిదేళ్లు పడుతుందంటున్నారు
- మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల ముందు తెలియదా ఏపీ ఆర్ధిక పరిస్థితి
- మా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు
- 54 లక్షల మంది రైతన్నలను మోసం చేశారు
- 18 వేలు ఇస్తామని కోటి 80 లక్షల మంది మహిళలను మోసం చేశారు
- కోటి మంది నిరుద్యోగులను దగా చేశారు
- బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు ముసలమ్మ సరిపోతుందన్నారు
- అమరావతి పేరుమీద వేల కోట్లు అప్పులు చేయడానికి మీరే కావాలా
- పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయడానికి మీ కూటమి అవసరమా
- ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
- జగన్ హయాంలో ఏపీలో పేదరికం 11.5 నుంచి 6శాతంకు తగ్గిందని నీతి ఆయోగ్ చెప్పింది
- నీతి ఆయోగ్ గణాంకాలకు ఏం సమాధానం చెబుతావ్ చంద్రబాబు
- ఈ ఏడు నెలల్లో తెచ్చిన లక్ష కోట్లకు పైగా అప్పు సొమ్మును ఏంచేశారో సమాధానం చెప్పాలి