పచ్చమూకల దాష్టీకం..
               27 Dec, 2024 17:07 IST            
                     అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైయస్ఆర్‌సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు.