వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం
6 Jun, 2024 13:20 IST
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను టీడీపీ నేతలు కూల్చడం అప్రజాస్వామికమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఖండించారు. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తామని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.