వైయస్ఆర్‌సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
9 Mar, 2019 13:05 IST
నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేయటంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కానీ ఓట్లు తొలగిస్తున్న వారిపై కాకుండా వారిని పట్టించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే కోటంరెడ్డి పోలీసులను దూషించారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఐదోనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.