రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప.. భరోసా లేదు
తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘వైయస్ఆర్‌సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు. కూటమి ప్రభుత్వంలో 16,890 కేసులు మహిళలపై నమోదయ్యాయని అనిత చెప్పారు. మహిళలకు ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైయస్ జగన్ గత ఐదేళ్లు నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగిందని’ శ్యామల వ్యాఖ్యానించారు.