చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి
అమరావతి: ఐటి వాళ్లు రెయిడ్ చేస్తే చంద్రబాబు భయపడుతున్నారని, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తామంటే ఆయనకు భయమని, .ఇప్పుడు ఐటిగ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు ఇస్తే ఎందుకు భయపడుతున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. డేటా చౌర్యం రాజద్రోహం కిందకే వస్తుందని..చంద్రబాబుపై రాజద్రోహం కింద ఎందుకు కేసు పెట్టకూదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఇలా...
-ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహస్యం చేస్తున్నారు.
-ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించినా ఏమి చేయలేని పరిస్దితి నెలకొంటుంది.
-డేటా చౌర్యం రాజద్రోహం కిందకే వస్తుంది.రాజద్రోహం కింద చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు.
-గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు.
-విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.
-ఐటి పరిజ్ఞానాన్ని లోకేష్ , చంద్రబాబులు కుట్రల కోసం వాడుకుంటున్నారు.
-ఐటి శాఖను కొడుకు చేతిలో పెట్టి ఓటర్ల లిస్ట్ లో మాయ చేస్తున్నారు.
-ప్రజల డేటాను చంద్రబాబు తన స్వార్ద ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.
-తన 40 ఏళ్ల అనుభవాన్ని ప్రజలకు మేలు చేయడానికి కాకుండా దుర్వినియోగం చేస్తున్నారు.
-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.వాటిపై తగిన చర్య తీసుకోవాలి.
-టిడిపికి సంభందించిన వ్యక్తుల చేతిలలో ట్యాబులలో పెట్టుకుని గ్రామగ్రామాన తిరుగుతూ తమ ప్రత్యర్థుల ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు.
-మా పార్టీ నేతలు అలాంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
-ఉమ్మడి రాజధాని పదేళ్లు పాటు ఇస్తే నీ అక్రమ కార్యక్రమాలకు కేంద్రంగా హైదరాబాద్ ను వాడుకుంటున్నారు.
-ఐటి వాళ్లు రెయిడ్ చేస్తే నీకే భయం, ఎన్ ఐ ఏ దర్యాప్తు చేస్తామంటే నీకే భయం.ఇప్పుడు ఐటిగ్రిడ్స్ సంస్దపై ఫిర్యాదు ఇస్తే నీకే భయం.
-ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు.చట్టం తనపని తాను చేసుకుంటుంటే మీకు భయం ఎందుకు.
-ఓటర్ల లిస్ట్ లో అక్రమాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటిపైకి ఏపి పోలీసులను చంద్రబాబు పంపారు.
-ఆంధ్రప్రదేశ్ ప్రదజలకు సంభందించిన డేటా ఐటి గ్రిడ్ కు అప్పగించడం రాజద్రోహం.
-సమాచారాన్ని జాగ్రత్తగా కాపా]డాల్సిన ముఖ్యమంత్రివి.నీ వే స్వయంగా ఆ సంస్ధలకు అప్పగించడం నేరం.
-వెన్నుపోటు పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడవడం తప్పితే రాష్ర్టానికి చేసిన మేలు ఏమిీ లేదు.
-అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచారు.
-వెన్నుపోటు పార్టీ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగాను రక్షణ లేదు.
--ఓటర్ల లిస్ట్ లలో గందరగోళం చేస్తూ పార్టీ నేతలతో ఒకే అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తారు.
-మంత్రి దేవినేని ఉమ అమరావతిని ఇడుపులపాయను తీసుకువెళ్తారని అబద్దాలు చేప్తాడు.
-రైతులకు గిట్టబాబు దరలేదు.బకాయిలు రావడంలేదు.వీటిని పట్టించుకోని దేవినేని ఉమ మీడియా ముందు మాటలు చెబుతు పబ్బం గడుబుతున్నారు.
- జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడకు వస్తే అబద్దాలు ప్రచారం చేస్తారు.]
-జగన్ పవన్ కల్యాణ్ మోది అని చంద్రబాబు ప్రచారం చేశారు.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్
కల్యాణ్ పేరు తొలగించి జగన్ మోది కేసిఆర్ అని ప్రచారం మొదలు పెట్టారు.
-ఎందుకు పవన్ ను తొలగించారు.మీకు మధ్య ఏమైనా కుదిరిందా వెల్లడించాలి.
-నీకు దమ్ముంటే నీవు ప్రజలకు అమలు చేసిన పనులు చెప్పి ఓట్ల అడుగు.
అంతేకాని ఓట్ల తొలగింపు ద్వారా ఇతర అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం దిగజారుడుతనం.
-దమ్ముంటే వైయస్ జగన్ ను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కో.
-ప్రశ్నించేవారిపై బురద జల్లడం మానుకో.
-చంద్రబాబు తీరు చూస్తే దొంగే...దొంగ అన్నట్లుగా ఉంది.
-డూప్లికేట్ ఓట్లతో, దొంగఓట్లతో ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే.