సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి
6 Jun, 2019 17:31 IST
విజయవాడ: రైతుల పక్షపాతిగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.12,500 రూపాయలు రైతు భరోసాతో పాటు 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.నకిలీ విత్తన మాఫీయాపై ఉక్కుపాదం మోపుతామన్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక రైతు నాయకుడిగా రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.సీఎం వైయస్ జగన్ అన్నదాత పక్షపాతి అని రుజువైందని తెలిపారు.రైతు భరోసా,ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు అని అన్నారు.ప్రతి హామీని అమలు చేయాలనే తపనతో సీఎం ఉన్నారని తెలిపారు.