చంద్రబాబు జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైంది
17 Feb, 2020 14:18 IST
శ్రీకాకుళం: చంద్రబాబు జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి అన్నారు. చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని అప్పులపాలు చేశాడని మండిపడ్డారు. అమరావతి పేరుతో రియలెస్టేట్ వ్యాపారం చేశాడన్నారు. బాబు పీఎస్ వద్దే రూ.2 వేల కోట్ల అక్రమ సంపాదన ఉంటే.. చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర ఇంకెంత డబ్బు ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ సోదాలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.