‘ఉర్సా’ పై ఉలుకు పలుకు లేదు
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన మనుషులకు విలువైన భూములు దోచి పెడుతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి విశాఖలో అరవై ఎకరాలు కట్టబెట్టారని.. ఈ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. దీనిపై కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘‘మూడు వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని.. లోకేష్ బినామీ కిలారీ రాజేష్ వందలకొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్‌కి తెరలేపింది. టీసీఎస్‌కి 21 ఎకరాలను తొంభై తొమ్మిది పైసలకు అమ్మేశారు. తమకు ఉచితంగా భూములు ఇవ్వమని టీసీఎస్ ఏమైనా ప్రభుత్వాన్ని అడిగిందా?. ఉర్సా కంపెనీ చిరునామాకి వెళితే అక్కడ కంపెనీ లేదు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.