అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ జగన్ కొనసాగిస్తున్నారు

13 Apr, 2025 17:13 IST

విజయవాడ:  అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ జగన్ కొనసాగిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తెలిపారు. అమరావతిలో పేదవాడికి సెంటు స్థలం కేటాయించని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన మాత్రం అక్కడ ఐదు ఎకరాల స్థలంలో ఇంటిని కట్టుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తుంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఆంబేద్కర్ ఆశయాల్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. 

‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైయ‌స్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైయ‌స్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు.  విజయవాడలో ఉన్న విగ్రహానికి చంద్రబాబు ఎందుకు నివాళులు అర్పించలేకపోతున్నారు.

వైయ‌స్ జగన్ నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దాన్ని చంద్రబాబు మూసివేస్తున్నారు.  అమరావతిలో సెంటు స్థలంలో పేదవాడిని ఇల్లు కట్టుకోనివ్వలేదు సీఎం చంద్రబాబు. కానీ ఆయన మాత్రం అదే అమరావతిలో  ఇంటిని నిర్మించుకోవడం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు’ అని జూపూడి ధ్వజమెత్తారు.