చంద్రబాబును నమ్మొద్దు...

24 Jan, 2019 11:33 IST

తూర్పుగోదావరి:టీడీపీ నాయకులంతా అక్రమంగా దాచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి  విమర్శించారు.ఈ ఎన్నికలు నీతికి,అవినీతికి మధ్యపోరాటంగా పేర్కొన్నారు.చంద్రబాబు వైయస్‌ జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.జననేత రూపొందించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న జనదీవెన యాత్ర పోస్టర్‌ను జక్కంపూడి విజయలక్ష్మి,రాజా,భరత్‌రామ్‌ ఆవిష్కరించారు.