ఇళ్ల పేరుతో డబ్బు వసూలు చేసిన నీచ చరిత్ర టీడీపీది
29 Oct, 2020 12:04 IST
విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇళ్ల పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ నేతలది అని మండిపడ్డారు. పేదరికం ప్రామాణికంగా.. అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైతే.. అది జీర్ణించుకోలేక పేదలకు ఇళ్లు రాకుండా టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నీచ రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.