అరెస్టులకు భయపడేది లేదు
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు.
గన్‌మెన్‌తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైయస్ఆర్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారంటే..
- రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం కోసం పనిచేయాల్సిన సంస్థ నైతికతను కోల్పోతున్నాయి
- ఎన్నికల్లో సీజ్ చేసిన నగదు కు సంబంధించి రిలీజ్ చేయమని ఆదాయ పన్ను శాఖ కు అఫిడవిట్ ఇచ్చారు
- 9.05.2024 లో ఈషా ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ ప్రద్యుమ్న కమీషనర్ ఆఫ్ పోలీస్ కు లేఖ రాశారు
- ఎన్నికల్లో సీజ్ అయిన నగదుకు సంబంధించి రిలీజ్ చేయమని చాలా స్పష్టంగా కోరారు
- దీనిపై
- కోర్టులో కేసు నడుస్తోంది, ఏడాది తర్వాత నాది అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు
- నాదగ్గర పనిచేసే గన్ మెన్ శ్రీకాకుళం లో ఉంటే బంధించి నిర్బంధంగా నా పేరు చెప్పిస్తున్నారు
- గత ఏడాది నా కుమారుడు పై తీవ్ర వాదులకు ఇచ్చే లుక్ అవుట్ నోటీస్ ఇచ్చి బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి తీసుకు వచ్చి 41 నోటీస్ ఇచ్చారు
- నాపై యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే నాపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు
- నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పాను
- మాపై తప్పుడు కేసులు పెట్టారు అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు
- ప్రద్యుమ్న ను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని హైకోర్టు తీర్పు చెప్పింది
- నా దగ్గర పనిచేసిన గన్ మెన్ గిరి ను బెదిరించి 500 కోట్లు రావాలి అని బలవంతంగా రాయించే ప్రయత్నం చేశారు
- 250 కోట్లు తెలంగాణ కు రవాణా చేశారు అని తప్పుడు స్టేట్ మెంట్ రికార్డు చేశారు
- ఏడాది తర్వాత నాపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
- కొల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి బెదిరిస్తున్నారు, వాళ్ళు చెప్పినట్లు స్టేట్ మెంట్స్ తీసుకున్నారు
- రాజ్ కసి రెడ్డి, ధనుంజయ్ రెడ్డి , కృష్ణ మోహన్ రెడ్డి తెలుసా అని నా గన్ ను బలవంతంగా 5 రోజులు పెట్టుకుని తప్పుడు స్టేట్ మెంట్ రికార్డు చేయించారు.
- తప్పుడు కేసులు పెట్టీ జైలుకు పంపించాలని చూస్తే నేను అరెస్టు సిద్ధమే..,
- నిజాలు కోర్టుకు తెలుస్తాయి
- చంద్రబాబు వచ్చాడు..నన్ను కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారు
- ఇదే కేసులో భవిష్యత్ లో మీరు కూడా జైలుకు పోకుండా చూసుకోండి.
- మీరు ఎప్పుడూ రమ్మన్నా నేను అరెస్టు కు సిద్ధం, మీకు అధికారంలో ఉండొచ్చు, నా కింద సిబ్బంది ను ఎందుకు వేదిస్తారు.?
- వైయస్ఆర్ కుటుంబంతో నాకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి
- గతంలో నాపై 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, కొట్టారు, ఎన్నో చిత్ర హింసలకు గురి చేశారు
- ఏనాడు నేను కేసులకు భయ పడింది లేదు
- నా తమ్ముడు మద్యం వల్ల లివర్ చెడిపోవడంతో చనిపోయాడు, మా తండ్రి చనిపోయాడు.
- నేను ఏ రోజు మద్యం తీసుకున్నది లేదు,ఎన్నికల్లో పంపిణీ చేసింది లేదు,
- నన్ను లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు
- మీరు చేస్తున్నది డిజిపి గారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రతి నిర్ణయాలకు వెంటాడతాయి
- సమయం వచ్చినపుడు దేవుడు శిక్ష విధిస్తాడు, న్యాయస్థానాలు వెంటాడతాయి
- నేను అరెస్టు ఎప్పుడూ సిద్ధం..
- నన్ను అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో.. నేను అరెస్టు కు సిద్ధమే
- మీరు రాయించిన తప్పుడు స్టేట్ మెంట్ లపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాం, మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తాం