చంద్రబాబు.. నిన్ను ప్రజలు నమ్మడం లేదు

7 Feb, 2019 17:54 IST

విశాఖ‌: చ‌ంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీలో  చంద్ర‌బాబు త‌న గురించి తాను గొప్ప‌లు చెప్పుకుంటూ స‌భ‌లో లేని వారిని హేళ‌న‌గా మాట్లాడ‌టం సంస్కారం కాద‌న్నారు. రాష్ట్రంలో అదాయం పెర‌గ‌లేదు కానీ, అప్పులు పెరిగాయ‌న్నారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు ఇలా..

-మన అప్పులు టిడిపి హయాంలో 96 వేల కోట్ల నుంచి 2 లక్షల50 వేల కోట్ల అప్పులకు చేర్చారు.
-సభలో లేనివారిని చంద్రబాబు హేళనగా మాట్లాడారు.
-చంద్రబాబుకు రామనామస్మరణలాగా జగన్ మోహన్ స్మరణ చేస్తున్నారు.
-శాసనసభలో ఆయనకు ఆయనే పొగుడుకుంటున్నారు.
-వాస్తవాల్ని వివరించే ప్రయత్నం చంద్రబాబు చేయడం లేదు.
-శ్రీ వైయస్ జగన్ అన్నవస్తున్నాడు అని ప్రోగ్రామ్ పెడితే దున్నవస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు.
-ముఖ్యమంత్రి స్దానంలో ఉండి తలబిరుసుతనంతో మాట్లాడుతు్న్నారు.
-ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.ఢిల్లీలో దీక్షకు కోటిన్నరకుపైగా డబ్బు కట్టి వారి తాబేదార్లను తీసుకువెళ్తున్నారు.
-నాలుగున్నరేళ్లు మీ పార్టీ మంత్రులు అక్కడ పాలన చేసి తగుదునమ్మ అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు.
-కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ఏం సాధించారు.
-రాష్ర్ట ఖర్చులు పెరిగాయి కాని ఆదాయం పెరగలేదు.
-నిన్నగా మొన్న చూశాం.రాష్ర్టం దివాళా తీసిందని మేం చెబుతున్నాం.
-సివిల్ ఏవియేషన్ కార్పోరేషన్ ను ప్రైవేటైజ్ చేస్తున్నట్లు ఏకంగా జిఓ ఇచ్చారు.
-దానినుంచి వ్యతిరేకత రావడంతో అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జిఓ వచ్చిందంట అందుకని అది రద్దు చేసామని చెప్పారు.
అంటే రాష్ర్టంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందో అర్దం అవుతుంది.
-విద్యుత్ సరఫరాకు సంభందించి ఎన్ టి పిసి కి డబ్బు చెల్లించాల్సిఉంది.
-2,130 కోట్ల రూపాయలు కట్టకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని నోటీసు ఇచ్చిందంటే ఆర్దికపరిస్దితి ఎలా అర్దం 
చేసుకోవచ్చు.
-నిజం జీవితంలో మనం అప్పుఉంటే చెక్కులు ఇవ్వండి.నగదు చెల్లించకపోతే బ్యాంకులో ఆ చెక్కులు
వేసుకుంటాం.
-అదే పరిస్దితి ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు చెక్కులు ఇచ్చారు.ఆ మహిళలు చెక్కులు తీసుకుని వెళ్తే మీ చెక్కులు
వడ్డీలకింద జమ అయ్యాయని బ్యాంకులవాళ్లు చెబుతున్నారు.
-అసలు ఆంధ్రరాష్ర్డ చరిత్రలో ముందుగా చెక్కులు ఇచ్చిన పరిస్దితి ఉందా?
-చంద్రబాబు ,కియామోటార్స్ గురించి మాట్లాడుతూ వోక్స్ వ్యాగన్ లో నాపేరు ప్రస్తావన తెచ్చి విమర్శలు చేశారు.
-చంద్రబాబుా వోక్స్ వ్యాగన్  విషయంలో  ఇప్పటి నీ లాలూచిలు దోపిడీలు తెలియక మేం ఆ కంపెనీకి 
 11 కోట్లు రూపాయలు ఇస్తే సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన విషయం మరిచిపోయావా?
-మాపై నీ డిమాండ్ మేరకు సిబిఐ విచారణ చేయించాం.వాస్తవాలు బయటపెడితే ఆ కంపెనీ మీ డబ్బు మీకు ఇస్తాం.విచారణ తీసేయండి అని
అడిగినా విచారణ చేయించుకున్నామే ఆ విషయం నీకు తెలియదా?
-ఈరోజు కియామోటార్స్ వస్తే స్దానికులకు ఉద్యోగాలు ఇచ్చారా?
-ఆనాడు మేం ఉన్నప్పుడు పరిశ్రమల శాఖమంత్రిగా అమెరికా వెళ్లి బాండ్రిక్స్ కంపెనీని తీసుకువచ్చి 25 వేల మందికి
ఉపాది కల్పించాం.అది దివంగత వైయస్ ,మా ఘనత కాదా?
-నీ ముఖ్యమంత్రిగా పరిపాలన సమయంలో అంతా కలిపి కనీసం 25 వేల మందికి ఉపాధి కల్పించగలిగావా?
-ఇప్పుడు ఆ కంపెనీ ఉంది ఆ కంపెనీ పెద్దలను అడగండి.ఆ కంపెనీ ఎవరి వల్ల వచ్చిందో చెబుతారు.
-నీకు నోరు ఉంది కదా అనుకుని అబద్దాలు నిజాలుగా నిజాలు అబద్దాలుగా చెబితే సరిపోతుందని అనుకుంటున్నావా.
-ఎందుకంటే రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేశావు.