అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
15 Oct, 2025 12:39 IST
వైయస్ఆర్ కడప జిల్లా: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం చిన్నదన్నూరు గ్రామంలో ఇల్లూరు రోడ్డులో దెబ్బతిన్న వరి పంటలను సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు అందేవి . ఇప్పుడు అధికారులు, అధికారం లో ఉన్న నాయకులు అసలు రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.