ఓటమి భయంతో బాబు దిగజారుడు రాజకీయాలు
అనంతపురం: ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. దొంగ సర్వేల పేరుతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్ సీపీ ఓట్లు తొలగించేందుకు బాబుకు సిగ్గుండాలన్నారు. ఆన్‌లైన్ ఫారం – 7 ద్వారా వైయస్‌ఆర్ సీపీ ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయామని గ్రహించిన చంద్రబాబు దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఓటరు జాబితా అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.