‘డీజీపీ అపాయింట్‌మెంట్ ఇచ్చి.. అవమానించారు’
మంగళగిరి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరగా, ఆయన మమ్మల్ని రమ్మని చెప్పి కలవకుండా అవమానపరిచారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ నేతలు అక్కడ జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నించినా వంశీ కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు. ఇవాళ అక్రమ కేసులో వంశీని అరెస్టు చేశారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదు. ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారు. దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు.