బాబు బానిస కూలీగా పవన్‌కళ్యాణ్!
తాడేపల్లి: చంద్రబాబు బానిస కూలీగా పవన్‌కళ్యాణ్ మారారని వైయస్ఆర్‌సీపీ నాయకుడు అడపా శేషు విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన ముఖ్యమంత్రిని ఎలా సంభోదించాలో తెలియని అజ్ఞానుల్లా వారి మాటతీరు ఉందని ధ్వజమెత్తారు. వారిద్దరూ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిందే అని సూచించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అడపా శేషు మీడియాతో మాట్లాడారు.
సంస్కారహీనులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లుః
ఎన్నికల క్షేత్రంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం సహజమే. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల తీరు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన ముఖ్యమంత్రిని ఎలా సంభోదించాలో తెలియని అజ్ఞానుల్లా వారి మాటతీరు ఉంది. వారిద్దరూ జగన్‌మోహన్‌రెడ్డి గారి నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిందే. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకుంటూ.. అక్కడికక్కడ పరిష్కారాలను చూపుతూ.. ఐదేళ్ల పరిపాలనను వారికి వివరించుకుంటూ జగన్ గారు ఎన్నికల జైత్రయాత్ర ఎలా చేస్తున్నారో.. మీరెలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కూటమి సభలకు వచ్చిన జనమంతా మీ అరుపులు, కేకలకు భయపడి, బెదిరిపోతున్నారన్న విషయం తెలుసుకుంటే మంచిది. కేవలం, మీకు మీరు పొగుడుకోవడం, జగన్‌గారిని దూషించడమే పనిగా సాగుతోన్న మీ సభల తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కాపులపై కక్షకట్టిన పవన్‌కళ్యాణ్ః
పవన్‌కళ్యాణ్ ప్రసంగాల తీరును చూస్తే... తన రాజకీయ ఎదుగుదలకు ప్రజలు, కాపులు సహకరించలేదని కక్ష గట్టినట్టు కనిపిస్తోంది. వారి అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. చిరంజీవి గారేమో.. రాజకీయ పార్టీని తాను నడపలేనని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి, తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు. అయితే, పవన్‌కళ్యాణ్ మాత్రం 2009 నుంచి ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే కోణంలో ఆయన మాటలు ఉన్నాయి. 2019లో తాను రెండు చోట్లా పోటీచేస్తే , రెండుచోట్లా ఓడించారనే దుగ్ధ పవన్ కళ్యాణ్ మనసులో ఉంది. ప్రధానంగా సొంత సామాజికవర్గమే తనకు సపోర్టు చేయలేదనే, కాపులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడు.
బాబు దగ్గర మార్కులకే పవన్ అరుపులు:
ఐదేళ్ల పాటు సుభిక్షమైన పరిపాలన అందించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది పవన్‌కళ్యాణ్..? ఆయనపై నువ్వు నోరుపారేసుకున్నంత మాత్రాన, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టినంత మాత్రాన రాజకీయంగా ఎటువంటి లబ్ధిపొందలేవు. మీ అన్నయ్య చిరంజీవిని అడ్డంపెట్టుకుని సినిమా రంగంలో స్థిరపడిన నీకు జగన్ గారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు..? పేదలు, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలో, ఆయనకు తెలిసినంతగా.. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు..? ఆయన పేదలపక్షాన పోరాడుతోన్న మానవతావాది. నువ్వేమో పెత్తందార్ల పక్షాన మాట్లాడుతున్న ప్యాకేజీస్టార్‌వి. కనుక, నీకు జగన్ గారి పేరెత్తే అర్హత లేదు.
బాబు బానిస కూలీగా పవన్‌కళ్యాణ్ః
పవన్‌కళ్యాణ్... నువ్వు నీ నటనా చాతుర్యంతో ఎన్నికల ప్రచారాన్ని అద్భుతంగా చేస్తున్నావని చంద్రబాబు సర్టిఫికేట్ పొందుతున్నావేమో కానీ, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను మాత్రం ఒక పెయిడ్ అర్టిస్టుగానే చూస్తున్నారు. రాజకీయాల్ని వదిలేశావు. జనసేన పార్టీనీ వదిలేశావు. నిన్ను నమ్ముకున్న కులాన్నీ వదిలేశావు. కేవలం, నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు కోసమే పనిచేసే బానిస కూలిగా నటిస్తున్నావు.
-నువ్వేమో చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్టుగా పనిచేస్తుంటే.. నువ్వు నిలబడ్డ పిఠాపురంలో, మరికొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తెప్పించి ప్రచారం చేసుకుంటున్నావు. పిఠాపురం నుంచి తాను ఓడిపోబోతున్నాడనే భయం పట్టుకుంది.
కాపులకు 2019 ఎన్నికల్లోనూ జగన్ గారు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. 30 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి.. ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి, ఐదుగురు మంత్రులను చేసి కాపుల గౌరవాన్ని నిలిపిన ఘనత శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. అలాగే, ఈ 2024 ఎన్నికల్లో కూడా 31 మంది కాపు నేతలకు ఎమ్మెల్యే సీట్లిచ్చారు. 6 గురికి ఎంపీ సీట్లిచ్చారు. అయితే, ఎక్కడైతే.. కాపు నాయకులు అభ్యర్థులుగా నిల్చున్నారో.. వారికి ఓడగొట్టడానికి మాత్రమే నువ్వు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నావు. అంటే, కాపుల రాజ్యాధికారం పెరగకుండా, వారిని అణచివేయడానికి చంద్రబాబు కుట్ర గట్టి మరీ నిన్ను వాడుతున్నట్లు తెలుసుకో పవన్‌కళ్యాణ్.. జనసేన నుంచి కాపులు మొత్తం వైఎస్‌ఆర్‌సీపీ వైపు ఎందుకు మొగ్గు చూపారో తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఇవాళ కాపులంతా, నీ పార్టీని వీడి, వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరారనే కసి, కోపంతోనే నీవంత ఫ్రస్టేషన్ గురై మాట్లాడుతున్నావని అందరికీ తెలుసు.
కూటమికి సమాధి.. వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం
కూటమిలోనే ఒకరికొకరికి పొసగడం లేదని ప్రజలకు తెలుసు. నువ్వూ, చంద్రబాబు కలిసి ప్రకటించిన మేనిఫెస్టో చెత్తబుట్టతో సమానమని అందరూ నవ్వుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నవరత్నాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ చేసి ప్రచారం చేసుకుంటున్నారని జనం చర్చించుకుంటున్నారు. పేదల జీవనప్రమాణాలను తీర్దిదిద్దే జగన్‌మోహన్‌రెడ్డిని మరో మారు సీఎం చేసుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు.. అని అడపా శేషు అన్నారు.