చంద్రబాబు కుప్పం ప్రశాంతతను చెడగొడుతున్నారు
తిరుపతి: చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతిసారి విధ్వంసక ఘటనలు జరుగుతున్నాయని, ఆయన వెళ్లిపోగానే ఒక్కడ అంతా ప్రశాంతంగా ఉంటుందని వైయస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కుప్పం ప్రశాంతతను చంద్రబాబు చెడగొడుతున్నారని మండిపడ్డారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నారా లోకేష్‌కు హితవు పలికారు. గురువారం తిరుపతిలో భరత్ మీడియాతో మాట్లాడారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలను కుక్కలతో పోల్చినందుకు నారా లోకేష్ క్షమాపణ చెప్పాలన్నారు. కుక్కల కంటే విశ్వాసం మనుషులకు ఉండదని గుర్తు చేశారు. ఇంకొక్కసారి వైయస్ఆర్సీపీ కార్యకర్తల గురించి ఇలాంటి తిక్క తిక్క మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.
సీఎం వైయస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి లోకేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు సీఎం, పెద్దిరెడ్డి గురించి మాట్లాడే స్థాయి లోకే ష్కు లేదు. 1974 నుంచి నారా చంద్రబాబు అనే వ్యక్తి పెద్దిరెడ్డి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 1974లో పెద్దిరెడ్డి యూనివర్సిటీలో లీడర్‌గా నిలబడితే..ఆయనకు పోటీగా మరో వ్యక్తిని నిలబెట్టలేని అసమర్ధుడు చంద్రబాబు. పెద్దిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టూడెంట్ లీడర్‌గా అప్పటి వీసీ పెద్దిరెడ్డికి గోల్డ్‌మెడల్ ఇచ్చి సత్కరించారు. 1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచినా కూడా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిదే ఆధిపత్యం. 15 స్థానాలకు గాను 9 సీట్లు పెద్దిరెడ్డి వర్గం గెలిస్తే..ఆరు స్థానాలకు టీడీపీ పరిమితమైంది. 2001లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే మా జెడ్పీ చైర్మన్‌గా రెడ్డమ్మను గెలిపించారు.
అలాంటి రామచంద్రారెడ్డి గురించి లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న పెద్దిరెడ్డిని ఏయ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తావా?. ఒక్కసారి పుంగనూరు ఫుడింగి అన్నందుకే అబ్బాకొడుకులిద్దరిని ప్రజలు రోడ్డుపై నిలబెట్టారు. మళ్లీ నువ్వు నోరు జారుతున్నావ్..జాగ్రత్త లోకేష్.
రామచంద్రారెడ్డికి స్క్రూ లూజ్ అయ్యిందని లోకేష్ మాట్లాడుతున్నాడు. ఎవరికండి స్క్రూ లూజు అయ్యింది. మేం ఇచ్చిన షాక్‌లకు తండ్రికొడుకులకు లూజు అవుతోంది. ఈ షాక్‌లు ఇక్కడితో ఆగవు. నెక్స్›్ట మేజర్ షాకులకు రాష్ట్రం నుంచి ఇద్దరూ ఖాళీ చేయాల్సిందే. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. అనవసరంగా నోజు జారితే మర్యాదగా ఉండదు. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతిసారి ఇలాంటి విధ్వంసకర సంఘటనలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెళ్లిపోగానే కుప్పం ప్రశాంతంగా ఉంటుంది. నాలుగు రోప్ పార్టీలు పెట్టి వైయస్ జగన్‌కు రక్షణ కల్పించామని చెబుతున్నారు. వైయస్ జగన్ పాదయాత్రలో జన సునామీని చూసి ..ఎక్కడ మీపై పడతారోనని భయపడి రోప్ పార్టీలు పెట్టారు. ప్రజా వేవ్‌లో వైయస్ జగన్ గెలిచారు. టీడీపీ పాలనలో కుప్పంలో 46 దొంగ కేసులు పెట్టారు. 70 ఏళ్ల ముసలాయనపై రేప్ కేసు పెట్టారు. ఇది టీడీపీ చరిత్ర. అన్యాయంగా కేసులు పెట్టామని మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని భరత్ పేర్కొన్నారు.