చంద్రబాబు ఏడాది పాలన చీకటిమయం

కర్నూలు: చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులను తలపించిందని, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం సృష్టించారని వైయస్ఆర్‌సీపీ కోడుమూరు ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. హామీల పేరుతో 5కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ..`ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాం. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైయస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైయస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి` అని ఆదిమూలపు సతీష్ తెలిపారు. కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ విక్రమ్ సింహరెడ్డి, జెడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షుడు నెహెమ్యా, మండల కన్వీనర్ మోహన్ బాబు ఎంపీటీసీ గోపాల్, కృష్ణ, ఆదాం, మధు, క్రిష్ణ రెడ్డి, ఎదురూరు వెంకటేష్, భైరాపురం క్రిష్ణ, మధు శేఖర్, అయ్యస్వామి, అనిల్ భాషా, మహేష్, మద్దిలేటి, రామ రాజు, క్రిష్ణ, సలీం, తదితరులు పాల్గొన్నారు.