వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై  దాడి

15 May, 2019 12:51 IST

టీడీపీ అరాచకాలకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ధర్నా 

విశాఖపట్నం:గోపాలపట్నం పైడితల్లి అమ్మవారి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు,కార్యకర్తల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పీఎస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.