జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట
ప్రకాశం జిల్లా: జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని వైయస్ఆర్‌సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే అ న్నా రాంబాబు అధ్యక్షతన శనివారం మార్కాపురంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారన్నారు. వైయస్ఆర్ సీపీలోకి ఎవరెవరో వస్తుంటారు.. పోతుంటారని, ఎవరు పార్టీ వీడి వెళ్లినా వైయస్ఆర్‌సీపీకి వచ్చిన నష్టం లేదని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 2029లో జిల్లాలోని అన్ని స్థానాలను వైయస్ఆర్‌సీపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైయస్ఆర్‌సీపీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ,మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.