రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైయస్ఆర్‌సీపీ కీలక సమావేశం…
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరాలు, సాగునీటి విస్తరణ, రైతులకు కలిగే ప్రయోజనాలపై నాయకులు విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సాధించేందుకు వైయస్ఆర్‌సీపీ కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి సాకే శైలజానాధ్, పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్ వి సతీష్ రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, ఆకేపాటి అమర్‌నాధ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు, రైతు విభాగం నేతలు, పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.