బాలకృష్ణకు ప్రజల సమస్యలు పట్టవా?
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టడం లేదని, ఆయనకు షూటింగ్సే ముఖ్యమని వైయస్ఆర్‌సీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ టీఎన్ దీపిక మండిపడ్డారు. ఇవాళ చిలమత్తూరు మండల కేంద్రంలోని విరాట్ ప్యాలెస్ లో హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దీపిక ఆధ్వర్యంలో `బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ..ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు ఎవరు లేరని, ఎన్నికలలో (సూపర్-6) పథకాలు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ఇవన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని, రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, మహిళలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలను పూర్తిగా విస్మరించారని, వ్యవస్థను అడ్డుపెట్టుకొని నాయకులను, కార్యకర్తల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు..
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి ఎక్కడో దేశ విదేశాల్లో షూటింగ్ లు చేసుకుంటూ చుట్టపు చూపుగా ప్రైవేట్ కార్యక్రమాలకు వస్తున్నారని విమర్శించారు.
బాలయ్య అభివృద్ధి మీద దృష్టి పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు & ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బలరాం రెడ్డి, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రెటరీ సురేష్ రెడ్డి, మరసలపల్లి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గిరిధర్ రాజు, మాజీ ఎంపీపీ అన్సర్ అహ్మద్, సర్పంచులు సంధ్య, జయశంకర్ రెడ్డి, వీరప్ప, రంగప్ప, ఎంపిటిసిలు రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కవిత, షాకీర్ తదితరులు పాల్గొన్నారు