ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కూటమి నేతలు మభ్యపెట్టే ప్రయత్నం
6 May, 2024 17:34 IST
తాడేపల్లి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కూటమిలో ఉన్న బిజేపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి మండిపడ్డారు. మోసం చేసి,నాటకాలు ఆడి ఓట్ల దండుకోవాలని చూస్తున్నాయి.కాని ప్రజలు వాటిని నమ్మేపరిస్దితి ఏమాత్రం లేదన్నారు. సోమవారం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.
- నీతి అయోగ్ ఎంతో ఎక్సర్ సైజ్ చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పింది.
- ఇదే విషయాన్ని చంద్రబాబు రాష్ర్టానికి వస్తున్న అమిత్ షా,రాజ్ నాద్ సింగ్ లను ఎందుకు అడగలేకపోతున్నారు.
- ల్యాండ్ టైటిల్ యాక్ట్ సూపర్ అని అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనలేదా..ఆ విషయం మీకు గుర్తులేదా.లేదా ఓట్ల కోసం ప్రజలను భయపెడుతున్నారా.
- ఇదే సమయంలో ఈ యాక్ట్ సూపర్ అని పురేందేశ్వరి అనలేదా...
- మీకు మీడియా,పత్రికలు ఉన్నాయి కాబట్టి కుట్రపూరితంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.
- ఇవి చేతగాని రాజకీయాలు.జగన్ గారిని ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారు.
- వైయస్ జగన్ కి స్టార్ట్ క్యాంపెనర్లు ప్రజలే..అవ్వా,తాతలు,యువత,మహిళలు అందరూ కూడా జగన్ కు అండగా ఉన్నారు.
- తిరుపతిలో అమిత్ షా మీద తిరుపతిలో రాళ్ల దాడి చేయించింది చంద్రబాబు కాదా.సిగ్గులేకుండా నేడు బిజేపితో టిడిపి జతకట్టింది.
- టిడిపి,జనసేన మేనిఫెస్టోను కనీసం టచ్ చేసేందుకు కూడా బిజేపి నేతలు ఇష్టపడటం లేదు.
- పవన్ కల్యాణ్,చంద్రబాబు,లోకేష్ లు ఎన్నికలలో ఓడిపోబోతున్నారు.
- వైయస్ జగన్ చెప్పింది చేస్తాడు.చేసేదే చెప్పడం జరుగుతుంది.
- చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫి అంటూ మోసం చేశారని నారాయణమూర్తి విమర్శించారు.