తాడేపల్లిగూడెంలో ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

12 Mar, 2026 14:11 IST

పశ్చిమగోదావరి జిల్లా:  తాడేప‌ల్లిగూడెంలో  వైయ‌స్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ వ‌డ్డి ర‌ఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట సవిత్రుపేటలోని పార్టీ కార్యాలయం వద్ద వడ్డి రఘురామ్ నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ వద్ద దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అన్న‌దాన కార్య‌క్ర‌మం 
తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని, ఇచ్చిన హామీలను అమలు చేసిన పార్టీ ఇదే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖ్యమంత్రిగా అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణం, మండలం, పెంటపాడు మండలాలకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.