అరకులో ఘనంగా వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
అరకు: వైయస్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ వైయస్ఆర్ ఆశయాలను సాధించడమే పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేసి 2029లో మళ్లీ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల గడపగడపకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు చెప్పుకునేలా ఏమీ చేయలేదని విమర్శించారు. అనంతరం అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నాయకుడు రేగం చాణిక్య, ఎస్టీ సెల్ నాయకుడు పంగి చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.