వైయ‌స్ఆర్‌సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్

3 Apr, 2026 18:58 IST

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి  పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ, పార్టీ వ్యవస్థాపక అంశాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు.


రాజధాని నిర్మాణం

రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్‌. మనం గతంలో విశాఖను గ్రోత్‌ కారిడార్‌గా అనుకున్నాం, అమరావతిని గుదిబండలా మార్చే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు, జగన్‌ గారు చెప్పినట్లు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు‌ రియల్ క్యాపిటల్ గా గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా మారుతుంది. ఆర్గానిక్‌ గ్రోత్ ఉంటుంది. ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. రాయ్‌పూర్‌, నోయిడాలు ఎన్ని ఏళ్ళయినా ప్రజా రాజధానిగా లేవు, చంద్రబాబు అమరావతి కోసం చేస్తున్న అప్పు ఎప్పటికి తీరుతుందో తెలీదు, కానీ జగన్‌ గారు ప్రతిపాదిస్తున్న ప్లాన్ బి అమరావతిలో పదో వంతు ఖర్చు పెడితే చక్కటి రాజధాని సిద్దమవుతోంది, అంతేకాదు అందులో కొంత డబ్బుతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ప్రాజెక్టులు పూర్తిచేయవచ్చు, ఇదంతా జగన్‌ గారు ఆలోచిస్తుంటే దానిని పక్కదోవ పట్టించడానికి నిన్నంతా టీడీపీ నాయకులు డ్రామాలు నడిపారు. పార్లమెంట్‌లో, ఉద్దండరాయునిపాలెంలో మట్టి కుప్పవద్ద దండాలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. పార్లమెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు చక్కగా మాట్లాడి రాష్ట్రం గురించి, రాజధాని గురించి చెప్పారు, జగన్‌ గారు చెప్పిన ప్రతి మాట గ్రామగ్రామానికి వెళ్ళాలి, రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అప్పులు అంతులేకుండా పోయాయి, ఇక దానికి వడ్డీల సంగతి సరేసరి, కానీ జగన్‌ గారు ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది వివరించారు. ఆచరణాత్మకంగా మనం చేయగలిగేది జగన్‌ గారు స్ఫష్టంగా చెప్పారు, చంద్రబాబు మాత్రం వేల ఎకరాల భూసమీకరణ, భూసేకరణలపై ప్రజల్లో చర్చ జరగాలి. రాజధాని పేరుతో చంద్రబాబు దింపుతున్న ఊబిలో దిగకుండా ప్లాన్ బి పేరుతో జగన్‌ గారు చెప్పిన ప్రణాళికపై విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలి. ఈరోజు కూడా అమరావతి నిరంతర ప్రక్రియ అంటున్నారు చంద్రబాబు, అంటే దానిని కామధేనువులా దోచుకోవాలన్నదే అతని ప్లాన్, ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చర్చ జరగాలి‌

తిరుమల పవిత్రత

పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఉన్న బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ఉపయోగిస్తున్న భాష తిరుమల పవిత్రతను రోజురోజుకీ దిగజార్చుతున్నాయి. ఈ అంశంపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఏమి లేనట్లుగా వ్యవహరిస్తూ తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఏప్రిల్ 4వ తేదీ (శనివారం) మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కాని లేని యెడల ప్రాచుర్యం కలిగిన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. 

రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమం బాగా హైలెట్‌ కావాలి, తక్షణమే అతను రాజీనామా చేసేలా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి


పార్టీ కమిటీల నిర్మాణం, ఐడీ కార్డుల వెరిఫికేషన్‌

వైయ‌స్ఆర్‌సీపీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది, అన్ని కమిటీలలో 18 లక్షల క్రియాశీల వైయ‌స్ఆర్‌సీపీ సైన్యం మన టార్గెట్‌, 13 లక్షలవరకు సెంట్రల్‌ ఆఫీస్‌కు డేటా అందింది. ఐడీ కార్డుల ప్రింటింగ్‌ కూడా త్వరలో ప్రారంభమయి, పంపిణీ కూడా జరగబోతుంది, ఐడీ కార్డుల డేటా ఎంట్రీ వెరిఫికేషన్‌ జాగ్రత్తగా జరుగుతోంది. దీనిపై పార్టీ అనుబంధ విభాగాలకు కొంత అవేర్‌నెస్‌, ఓరియెంటేషన్‌ ముఖ్యం, డిజిటల్ మేనేజర్లు, ఐటీ, యూత్, సోషల్ మీడియా వింగ్స్‌ ఇందులో మరింత భాగస్వామ్యం అవ్వాలి. గ్రామ స్ధాయి నుంచి మన పార్టీ క్యాంపెయినింగ్‌ సోషల్ మీడియాలో విస్తృతంగా జరగాలి. అందుకు అవసరమైన అకౌంట్స్‌, గ్రూప్‌లు ఏర్పాటు చేసుకోవాలి. మన అధినేత జగన్‌ గారు సీరియస్‌గా కమిటీల నియామకంపై దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నాయకులు చొరవ తీసుకుని ముందుకెళ్ళాలి, కమిటీల ఏర్పాటు బాగా జరిగినప్పుడే పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుంది. కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలి. 

ఎస్‌ఐఆర్‌ కు సంబంధించి బీఎల్‌వోలు కీలకంగా ఉంటారు, వారితో బీఎల్ఏలు సమన్వయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి, ఓటర్ల జాబితాలు, వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవడం, కొత్త ఓటర్ల నమోదు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి

ఆరోగ్యశ్రీ, హాస్పిటల్స్‌ సేవలు బంద్‌, ఫీజు రీఇంబర్స్‌మెంట్

ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోవడం వల్ల రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దీనిపై ఆసుపత్రులకు వెళ్ళి రోగులతో మాట్లాడాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా మన కార్యాచరణ ఉండాలి, వచ్చే వారంలో ఈ కార్యక్రమం ఉండాలి, దీంతోపాటు ఫీజు రీఇంబర్స్‌మెంట్ పై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, విద్యార్ధుల సమస్యపై వారి తరుపున ప్రభుత్వాన్ని నిలదీయాలి. 

సాగునీటి ప్రాజెక్ట్‌లు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ పై జిల్లాల వారీగా రాయలసీమ జిల్లాలలో సమావేశాలు జరుగుతున్నాయి, ఆల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపుపై జిల్లా స్ధాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసి పక్క రాష్ట్రాలకు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. రైతు విభాగం, రైతు సంఘాలు మరింత యాక్టివేట్ అవ్వాలి. 

పోర్ట్‌ల సందర్శన

పోర్టుల విషయంలో మూలపేట పోర్ట్‌ సమావేశం బాగా జరిగింది, మున్ముందు రామాయపట్నం, మచిలీపట్నం పోర్ట్‌ల వద్ద కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, వీలును బట్టి మన నాయకుడు జగన్‌ గారు కూడా ఏదో ఒక పోర్ట్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొంటారు. 

మునిసిపల్ ఎన్నికలు

మునిసిపల్ కార్పొరేషన్‌లు, వార్డుల డీలిమిటేషన్‌ జరుగుతోంది, దీనిపై కూడా మీరు అలెర్గ్‌గా ఉండి దృష్టిపెట్టాలి.