వైయస్ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సమావేశం
29 May, 2025 17:55 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ క్రమశిక్షణా కమిటీ మొట్టమొదటి సమావేశం జరిగింది. వైయస్ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణా కమిటీకి సంబంధించి విధివిధానాలపై చర్చించారు. అనంతరం పార్టీ క్రమశిక్షణకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. ఈ సమావేశంలో క్రమశిక్షణా కమిటీ సభ్యులు తానేటి వనిత, రెడ్డి శాంతి, కైలే అనిల్‌కుమార్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.